5 నుంచి ఎడ్ సెట్ చివరిదశ కౌన్సిలింగ్
Bachelor Of Education(B.Ed) కోర్సులో ప్రవేశాల కోసం చివరిదశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.Feb 5 నుండి 10 వరకు విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. ఆయా తేదిల్లోనే విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని, సర్టిఫికేట్ కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంది. రిజిస్టర్ చేసుకున్న వారి జాబితా 11వ తేదీన ప్రకటించనున్నట్లు చెప్పింది. విద్యార్థులు 12,13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని,14వ తేదీన ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను 17వ తేదీన ప్రకటిస్తామని వివరించింది.
Website Link:http://edcetadm.tsche.ac.in/
No comments:
Post a Comment